ఐఏఏఫ్‌కు పాలమూరు కుర్రాడు

Telangana Student Selected In National Defence Academy  - Sakshi

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు వనపర్తి విద్యార్థి 

తెలంగాణ నుంచి ఎంపికై ఏకైక విద్యార్థిగా గుర్తింపు 

3.12 లక్షల మందిలో అర్హత సాధించిన నిఖిల్‌సాయియాదవ్‌ 

రేపు పుణెలోని ఎన్‌డీఏలో ప్రవేశానికి యూపీఎస్‌సీ అనుమతి 

మూడేళ్ల పైలట్‌ శిక్షణతోపాటు బీటెక్‌ చదివించనున్న కేంద్ర ప్రభుత్వం 

సాక్షి, వనపర్తి(మహబూబ్‌ నగర్‌) : దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనుగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో అర్హత సాధించి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌కు శిక్షణ తీసుకోనున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ, ఆలోచన, దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు. ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో స్థానం సంపాదించాడు. సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందనున్నాడు. నేవీ, ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్‌ ఫోర్స్‌కు సంబంధించిన అన్ని టెస్టుల్లోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు. దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్ప టి నుంచి కలలు గన్న ఆ యువకుడి తల్లిదండ్రుల ఆశయాలు ఫలించాయి.

వనపర్తి లోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్‌ 2018 సెప్టెంబర్‌ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్‌ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్‌ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్‌ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్‌ 30న ఎంట్రెన్స్‌ ఫలితాలు విడుదల కావ డంతో అర్హత సాధించిన వారికి డెహ్రడూన్‌ లో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఈ ఏడాది జనవరి 14 నుంచి 19 వరకు డ్యాకుమెంట్‌ వెరిఫికేషన్, ఫిజిక ల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు, సైకాలజీ టెస్టులో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్టులు ఒక పిక్చర్‌ చూయిం చి దానిపై స్టోరీ రాయించడం, స్విచ్‌వేషన్‌ రియాక్ట్‌ టెస్టులో 60 స్విచ్‌ వేషన్‌లను 30 నిమిషాల్లో స్టూడెంట్‌ 30 రియాక్షన్స్‌ పేర్కొన్నాలి.

సెల్ఫ్‌ డిక్రిప్షన్, వర్డ్‌ అసోసియేషన్‌ టెస్టులో 15 సెకన్లకు వచ్చే ఒక వర్డ్‌పై సెంటన్స్‌ రాయడం, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఒక గంట మౌఖికంగా నిర్వహించడం, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో గ్రూప్‌ చర్చలు, గ్రూప్‌ ప్లానింగ్‌ ఎక్సర్‌సైజ్, ప్రోగ్రెసివ్‌ గ్రూప్‌ చాట్, ఆఫ్‌ గ్రూప్‌ చాట్, సెల్స్‌ ఆప్టికల్స్, గ్రూప్‌ ఆప్స్‌ కిల్‌ రేస్, కమాండ్‌ టాస్క్‌ లెక్చరేట్, ఫైనాల్‌  గ్రూప్‌ టాస్క్‌ మెడికల్‌ ఎగ్జామ్‌ ఇలా అన్నింటిలో అర్హత సాధించాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 21 నుంచి 25 వరకు ఎయిర్‌ ఫోర్స్‌ సెంట్రల్‌ మెడికల్‌ ఎస్టాబిలీష్‌మెంట్‌ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అన్నింటిలో మెరుగ్గా తేలడంతో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది. ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు, ప్రతి ఆరు నెలలకోసారి యూపీఎస్‌సీ భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్‌ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది. 

మూడేళ్ల శిక్షణతోపాటు బీటెక్‌ 
అని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్‌సీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్‌సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్‌వాస్‌లో గల ఎన్‌డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్‌ ఫోర్స్‌తోపాటు బీటెక్‌ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. 

సంతోషంగా ఉంది 
నేను దేశానికి సేవ చేయబోతున్నాననే మాట ఎంతో సంతృస్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశయాన్నీ నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకున్నా. అదే పట్టుదలతో దేశానికి సేవ చేస్తాను. ప్రణాళికబద్ధంగా చదువుకొని ముందుకు సాగాను. ఇకపై కూడా అన్ని పరీక్షల్లోనూ పూర్తిగా అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది. 
– నిఖిల్‌సాయి, వనపర్తి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top