కేసీఆర్‌ దీక్ష ఫలితమే తెలంగాణ | Telangana is the result of KCR's initiation | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దీక్ష ఫలితమే తెలంగాణ

Dec 5 2017 10:22 AM | Updated on Sep 26 2018 6:01 PM

Telangana is the result of KCR's initiation - Sakshi

కట్టంగూర్‌ (నకిరేకల్‌) : కేసీఆర్‌ దీక్ష ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని సోమవారం కట్టంగూర్‌లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెటుతున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరు చూసి ఓర్వలేకనే కాం గ్రెస్‌ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నా రు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్‌ చెప్పిన మాటలు అమలు చేస్తుంటే ప్రతి పక్షంతోపాటు అన్ని పార్టీల నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. 

ప్రతి ఇంటికీ నీరు, లక్షా పదివేల ఉద్యోగా లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి వేముల పుష్ప కళాకారుల బృందం ఆటపాటలతో అలరించారు.  కార్యక్రమంలో ఎంపీపీ కొండ లింగస్వామిగౌడ్, జెడ్పీటీసీ మాద యాదగిరి, ఊట్కూ రి ఏడుకొండలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, సర్పంచ్‌ ఐతగోని నారాయణ, ఆకుల సైదులు, ఎంపీటీసీలు ఐతగోని ఝాన్సీనర్సింహ్మ, మంగదుడ్ల వెంకన్న, పబ్బు వెంకటేశ్వర్లు, గుండగోని రాములు, గడుసు శంకర్‌రెడ్డి,  వెంకట్‌రెడ్డి,దానయ్య, వెంకటయ్య, సాయిలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement