‘తెలంగాణ ఆన్ మిషన్-2020’ పేరిట నిరుద్యోగ యువతకు ఉపాధిక ల్పనే లక్ష్యంగా జాబ్‌మేళాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కౌసుల తెలిపారు.
కరీంనగర్: ‘తెలంగాణ ఆన్ మిషన్-2020’ పేరిట నిరుద్యోగ యువతకు ఉపాధిక ల్పనే లక్ష్యంగా జాబ్‌మేళాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కౌసుల తెలిపారు. ఇందులో భాగంగా మొట్టమొదట జూలై 11, 12వ తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహజ ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో జాబ్‌మేళాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పూర్తిగా ఉచితంగా నిర్వహించే ఈ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.