నకిలీ విత్తనాల తయారీ, విక్రయాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.
హైదరాబాద్: నకిలీ విత్తనాల తయారీ, విక్రయాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమాలకు ఊతమిచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నలుగురు అధికారుల సస్పెన్షన్, ఇద్దరికి ఛార్జ్ మెమోలు జారీ చేసింది.
భూత్పూర్ ఎంఏవో అశ్విని పంకజ్, హయత్‌నగర్ ఎంఏవో రవీంద్రనాథ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ కవిత, దేవరకద్ర ఏడీఏ ఇందిరలను సస్పెండ్ చేసింది. దీంతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల డీఏవోలకు గురువారం ఛార్జిమెమోలు పంపింది.