కరోనా పరీక్షలు, చికిత్స : దేనికెంత..?

Telangana Government Guidelines To Private Hospitals For Corona Testing And Treatment - Sakshi

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు మార్గదర్శకాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను అందులో పొందుపరిచారు. 

ప్యాకేజీ  రోజువారీ ఫీజు (రూ.లలో)
రొటీన్‌ వార్డ్‌ + ఐసోలేషన్  4,000 
ఐసీయూ (వెంటిలేటర్‌ లేకుండా) + ఐసోలేషన్‌ 7,500 
ఐసీయూ (వెంటిలేటర్‌ సహా) + ఐసోలేషన్ 9,000

 ప్యాకేజీలో లభించేవి.. 
ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలన్నింట్లో రోగికి సీబీసీ, యూరిన్‌ రొటీన్, హైచ్‌ఐవీ స్పాట్, యాంటీ హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటినైన్, యూఎస్‌జీ, 2డీ ఎకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్‌ చార్జెస్, మీల్స్‌తోపాటు ప్రొసిజర్స్‌ (రెలెస్ట్యూబ్‌ ఇన్సర్షన్, యూరినరీ ట్రాక్ట్‌ క్యాథెటరైజేషన్‌) సేవలు అందుతాయి.

ప్యాకేజీలో లభించనివి... 
పీపీఈ కిట్లు 
ఇంటర్వెన్షనల్‌ ప్రొసీజర్స్‌ (సెంట్రల్‌ లైన్‌ ఇన్సర్షన్, కీమోపోర్ట్‌ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్‌ ప్రొసిజర్, బైయాప్సీస్, యాసిటిక్‌/ప్లైరల్‌ టాప్పింగ్‌. వీటికి 2019 31 డిసెంబర్‌ నాటి ర్యాక్‌ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.) 
కోవిడ్‌–19 టెస్టింగ్‌ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం) 
హైఎండ్‌ డ్రగ్స్‌ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్‌ న్యూట్రిషన్, టోసిల్‌జంబ్‌. వీటికి ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలి) 
హై ఎండ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ (సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్‌ పరీక్షలు) 

ల్యాబ్‌ పరీక్షలకు ఫీజులు ఇలా... 

కేటగిరీ   ఫీజు 
ల్యాబ్‌/హాస్పిటల్‌ వద్ద శాంపిల్‌ ఇస్తే రూ. 2,200 
ఇంటి వద్దకు వచ్చి శాంపిల్‌ సేకరిస్తే     రూ. 2,800 

ప్రభుత్వ మార్గదర్శకాలివీ.. 
కరోనా చికిత్స చేసే ప్రైవే టు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్‌ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శిస్తూ ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. 
రోగులు, వారి బంధువుల  కు సేవల వివరాలను వెల్లడించాలి.
పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వా ళ్లు, అతితక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చే ర్చుకోవద్దు. వారిని హోం ఐసోలేషన్‌కు పరిమితం చేయాలి.
ఐసీఎంఆర్‌ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి. 
కరోనా అప్‌డేట్స్‌ను ప్రభు త్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వెబ్‌సైట్‌లో సకాలంలో పొందుపరచాలి. ఇందుకు ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు జారీ అవుతాయి.
నిబంధనలకు లో బడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వ్యవహరించాలి.
కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్‌ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే  చర్యలు ఉంటాయి.
ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే  టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top