నేటి నుంచి ఎంసెట్‌  | Telangana EAMCET Begins From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంసెట్‌ 

May 3 2019 3:41 AM | Updated on May 3 2019 3:41 AM

Telangana EAMCET Begins From Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరగునున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులను 2 గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్‌ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్‌ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్‌ లాగ్‌ టేబుల్స్, పేపర్లు, సెల్‌ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ నిషేధం.  


 

Advertisement
 
Advertisement
Advertisement