
కిరాణా కొట్టు లెక్కల్లా బడ్జెట్: టీడీపీ
తెలంగాణ బడ్జెట్ కిరణా కొట్టు లెక్కల్లా ఉందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ బడ్జెట్ కిరణా కొట్టు లెక్కల్లా ఉందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డి విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అంటూ దానికి రూ. 25 కోట్లు కేటాయించారని, కానీ 25 లక్షల మంది విద్యార్థులకు ఆ మొత్తం ఏ మూలకు సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే విద్యుత్ కోసం కేటాయించిన రూ. 3వేల కోట్లు కడా కేవలం ఉచిత విద్యుత్కే సరిపోతుందని ఆయన అన్నారు. అలాంటప్పుడు అదనపు విద్యుత్తును ఎలా కొనుగోలు చేస్తారని నిలదీశారు. తెలంగాణ కోసం కేవలం 459 మంది మాత్రమే అమరులయ్యారంటూ తప్పుడు లెక్కలు చూపించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇక ఈ బడ్జెట్ పచ్చి మోసమని టీ-టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులను ఈ బడ్జెట్ పచ్చిమోసం చేస్తోందని, కేవలం కేసీఆర్ కొడుక్కి, అల్లుడికి మాత్రమే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆయన మండిపడ్డారు.