తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశం ఈ నెల 9న జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశం ఈ నెల 9న జరగనుంది. అదే రోజు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు.
ఈ నెల 2న ఆవిర్భంవించిన తెలంగాణ రాష్ట్రానికి కే చంద్రశేఖర రావు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది కెబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదన్ రావు పేరు వినిపిస్తోంది.