
తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. శాసనసభ తొలి సమావేశం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయింది. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ ఆహ్మద్‌ఖాన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత తాత్కాలిక స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
తొలుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తర్వాత సభలో మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా తర్వాత.. అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగగా.. ఐదుగురు సభకు హాజరు కాలేదు. సభకు గైర్హాజరైన వారిలో అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్‌లున్నారు.