చాయ్‌ బాగుంది  

Tea Super.. - Sakshi

ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు కితాబు 

కాన్వాయ్‌ ఆపి టీ ఆస్వాదించిన అమాత్యుడు

రాజేంద్రనగర్‌ : చాయ్‌ ప్రియుడు ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు శుక్రవారం తన కాన్వాయ్‌ని ఆపి టీ తాగి ఆస్వాదించారు. హిమాయత్‌సాగర్‌ ప్రధాన రహదారి వద్ద ఉన్న ఎౖMð్సజ్‌ పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి నగరానికి వెళ్తూ మార్గంమధ్యలో ఆరెమైసమ్మ దేవాలయం ప్రధాన రహదారిపై ఉన్న చాయ్‌ దుకాణాన్ని చూసి తన కాన్వాయ్‌ని ఆపారు.

మంత్రి తన వాహనం నుంచి నేరుగా దిగి చాయ్‌ బండి వద్దకు వెళ్లారు. చాయ్‌ ఉందా.. అంటూ అడిగిగారు. మంత్రి వాహనం వెనకే ఉన్న స్థానిక నాయకులు అక్కడికి చేరుకొని మంత్రికి టీ అందించారు. స్వయంగా మంత్రి తన దుకాణానికి వచ్చి చాయ్‌ తాగడంతో నిర్వాహకుడు సైతం ఆశ్చర్యపోయాడు. చాయ్‌ బాగుందని కితాబిచ్చిన మంత్రి తిరిగి కాన్వాయ్‌లో వెళ్లిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top