
'పెదవులపై చిరునవ్వు, కడుపులో విషం'
తెలంగాణ ప్రజలకు కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకే ఉందన్నారు. కృష్ణా బోర్డు అనుమానాలకు తాము సమాధానం ఇచ్చామన్నారు.
పెదవులపై చిరునవ్వు, కడుపులో విషం- చంద్రబాబు నైజమన్నారు. వెన్నుపోటు, మోసం, దగాల్లో చంద్రబాబుకు జీవితకాలపు డాక్టరేట్ ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ విషయంలో గవర్నర్ దగ్గరకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను విమర్శించడానికి మాటలు కూడా లేవని హరీశ్రావు అన్నారు.