తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా) రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.40లక్షల విరాళాన్ని అందజేసింది.
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా) రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.40లక్షల విరాళాన్ని అందజేసింది. ‘టాటా’ ఈ నెల 5న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లోని రాయల్ అలర్ట్ ప్యాలెస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటన వెలువరించారు. ‘టాటా’ ఆవిర్భావ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు హాజరయ్యారు. సుమారు 3వేల మంది ప్రవాస తెలంగాణవాసులు కూడా హాజరయ్యారని నిర్వాహకులు పేర్కొన్నారు. వరంగల్‌లోని సుధాకర్ విద్యాలయానికి కూడా ‘టాటా’ రూ.10 లక్షలు విరాళం అందజేసినట్లు తెలిపారు.