తెలంగాణలో లారీల సమ్మె ప్రారంభమైంది. బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
హైదరాబాద్ : తెలంగాణలో లారీల సమ్మె ప్రారంభమైంది. బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం లారీ యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె యథాతథం అయ్యింది. రవాణా పన్ను తగ్గించడంతో పాటు... రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ ప్రవేశపెట్టడం సహా 11 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లారీలు, ట్రక్కులు నిలిచిపోయాయి. లారీల సమ్మెతో వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. కూరగాయలు, నిత్యావసరాల ధరల పెంపుతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.