
ఎన్నారైలు అండగా నిలవాలి: తలసాని
తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి ఎన్నారైలు అండగా నిలవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి ఎన్నారైలు అండగా నిలవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ, తెలంగాణ జాగృతి సంస్థలు సంయుక్తంగా డెట్రాయిట్‌లో మంత్రి తలసానితో ‘ మీట్ అండ్ గ్రీట్ ’ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ వద్ద కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, కవి సుద్దాల అశోక్ తేజ, టీన్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ పి.వి.శ్రీనివాస్, పీఓడ బ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.