కీచక ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి | take action on college principal, demands ded students | Sakshi
Sakshi News home page

కీచక ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి

Feb 23 2015 8:06 PM | Updated on Mar 28 2018 11:11 AM

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కేఆర్‌కే డిఎడ్ కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు.

రంగారెడ్డి (కీసర): విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కేఆర్‌కే డిఎడ్ కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలోని కేఆర్‌కే డీఎడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి కొన్ని నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించుకొని లైంగికంగా వేధిస్తున్నారని వారు వాపోయారు. సెల్‌ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఎవరికైనా చెబితే హాజరు శాతాన్ని తగ్గిస్తానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులపై కళాశాల డైరైక్టర్ రాధాకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేదన్నారు. తప్పని సరి పరిస్థితుల్లోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. కీచక ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని వారు నినదించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని కీసర సి.ఐ గురువారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement