'ఇక బహిరంగంగా మద్యం తాగం' | swearing on drinkers | Sakshi
Sakshi News home page

'ఇక బహిరంగంగా మద్యం తాగం'

May 29 2015 7:11 PM | Updated on Sep 4 2018 5:16 PM

బహిరంగంగా మద్యం తాగుతున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నపోలీసులు వారిచే మరోసారి బహిరంగంగా మద్యం తాగనని ప్రతిజ్ఞ చేయించారు.

పంజగుట్ట: బహిరంగంగా మద్యం తాగుతున్న 26 మందిని అదుపులోకి తీసుకున్నపోలీసులు వారిచే మరోసారి బహిరంగంగా మద్యం తాగనని ప్రతిజ్ఞ చేయించారు. పోలీసుల వివరాల ప్రకారం శుక్రవారం పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్స్ సమీపంలో ఉన్న గణేష్ వైన్స్ వద్ద, రాజ్‌భవన్ రోడ్డు, బంజారాహిల్స్ రోడ్డు నెం బర్ 1 వైన్స్‌ల ముందు ప్రధాన రహదార్లపై మద్యం తాగుతున్న 26 మందిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

 

అనంతరం వారిని ఎస్ ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ డీసీపీ వెంకటేశ్వర్‌రావు సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్లపై మద్యం తాగడం తప్పు, మద్యం తాగడం వల్ల సాధారణ వ్యక్తులకు, మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుచేత మరోసారి బహిరంగంగా మద్యం తాగము. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాము’ అని వారిచే ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement