'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది' | Sunitha Lakshma Reddy takes on trs party | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది'

Aug 27 2014 10:09 AM | Updated on Aug 14 2018 2:50 PM

'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది' - Sakshi

'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది'

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించామనే బాధ రాష్ట్ర ప్రజల్లో ఉందని మాజీ మంత్రి, మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించామనే బాధ రాష్ట్ర ప్రజల్లో ఉందని మాజీ మంత్రి, మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో టీ.పీసీసీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నుంచి మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఆమె బీఫారం తీసుకున్నారు.

అనంతరం సునీత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని అలాగే మెదక్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ఆ పార్టీ కార్యాచరణను ప్రకటించలేకపోయిందని ఆమె విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement