బెల్లం నిల్వల స్వాధీనం | sugar captured in bhongir | Sakshi
Sakshi News home page

బెల్లం నిల్వల స్వాధీనం

Aug 4 2015 4:22 PM | Updated on Sep 3 2017 6:46 AM

నాటుసారా తయారీకి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న బెల్లం నిల్వలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

భువనగిరి: నాటుసారా తయారీకి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న బెల్లం నిల్వలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ సీఐ తిరుపతి నేతృత్వంలో ఎస్ఐలు సురేష్ బాబు, భిక్షపతి తదితర సిబ్బంది బెల్లం దుకాణాలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గంజ్ మార్కెట్లోని సాయిగణేష్ ట్రేడర్స్ దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన 54 బస్తాల బెల్లం పౌడర్, 76 బెల్లం ముద్దలు, రెండు బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement