ట్రిపుల్‌ ఐటీ–హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘స్టెప్‌’ | Student Technology Education Program under IIIT-Hyderabad | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ–హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘స్టెప్‌’

Feb 13 2019 2:23 AM | Updated on Feb 13 2019 2:23 AM

Student Technology Education Program under IIIT-Hyderabad - Sakshi

హైదరాబాద్‌: పాఠశాల స్థాయి విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో పోటీతత్వం, వినూత్న, విశ్లేషణాత్మకమైన ఆలోచనా విధానాలతో ముందుకుసాగేలా చేయడానికి సరికొత్త కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.  7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం స్టూడెంట్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (స్టెప్‌) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో చేరదలచుకున్న విద్యార్థులు ఏప్రిల్‌ 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో 7,8 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ అప్లికేషన్స్‌ (సీటీఏ) కోర్సును, 9,10 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (సీటీపీఎస్‌) కోర్సును నిర్వహించాలని తలపెట్టారు.

మొదట దరఖాస్తు చేసుకున్నవారికి తొలి అవకాశం కల్పించారు. తరగతులను మే 6 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. అడ్మిషన్, ఇతర వివరాలకు వెబ్‌సైట్‌  https:// www. iiit. ac. in/ stel/ను సంప్రదించాలి. పాఠశాల స్థాయి విద్యార్థులలో విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలను సైద్ధాంతికత ద్వారా పెంపొందించేలా చేయడం, మానసిక నైపుణ్యాలను ధృడంగా చేయడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ఈ కోర్సులు ట్రిపుల్‌ఐటీ– హైదరాబాద్‌ ఫ్యాకల్టీ, ఇతర విజిటింగ్‌ ఫ్యాకల్టీ ద్వారా నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ఒలంపియాడ్లలో అర్హత సాధించారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లను అందిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement