 
															విద్యార్థుల నిర్బంధం
కరీంనగర్ ఆ విద్యార్థులకు రాజకీయాలు పట్టవు. నాయకులెవరో తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే... ఉదయం, సాయంత్రం క్రీడా సాధన చేయడం. అలాంటి వారిని గదిలో వేసి పోలీసులు నిర్బంధించారు.
	కరీంనగర్  ఆ విద్యార్థులకు రాజకీయాలు పట్టవు. నాయకులెవరో తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే... ఉదయం, సాయంత్రం క్రీడా సాధన చేయడం. అలాంటి వారిని గదిలో వేసి పోలీసులు నిర్బంధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలో జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఉంది. విద్యార్థుల వసతిగృహాలు కూడా ఇందులోనే ఉన్నాయి.
	
	బుధవారం స్టేడియంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనం స్టేడియానికి వచ్చారు. వారందరినీ స్టేడియంలోకి అనుమతించిన పోలీసులు.. సభ జరుగుతున్నంత సేపు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను మాత్రం గదుల్లో బంధించారు. గదులకు బయటి నుంచి తాళం వేసి పోలీస్ సిబ్బందిని కాపలా పెట్టారు. ఇది చూసిన జనం విస్మయం చెందారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
