లక్ష మందితో ‘విద్యార్థి మహా సైన్యం’ | Sakshi
Sakshi News home page

లక్ష మందితో ‘విద్యార్థి మహా సైన్యం’

Published Thu, Aug 28 2014 12:15 AM

student maha sainyam with one lakhs students

 సింగాపూర్ (శంకర్‌పల్లి): విద్యార్థుల త్యాగాల  పునాదులపై  ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని  కాపాడేందుకు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో లక్ష మంది విద్యార్థులతో మహాసైన్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, తెలంగాణ రాష్ట్ర టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిలు తెలిపారు.

బుధవారం మండలంలోని సింగాపూర్ మణి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మోయిన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం- విద్యార్థుల సంక్షేమం అనే ఆంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తమ భవిష్యత్ మారుతుందని కలలు కన్న ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు.

రైతులు విద్యుత్ కోసం, విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్లపైకి వస్తున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శరత్‌చంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 31న జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, శంకర్‌పల్లి సొసైటీ చైర్మన్ బొల్లారం మోహన్‌రెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అశోక్‌కుమార్, నాయకులు ఉదయ్‌మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement