జువైనల్ హోంలో విద్యార్థికి చిత్రహింసలు.. | Student brutally beaten by Juvainal home dupty superintendent | Sakshi
Sakshi News home page

జువైనల్ హోంలో విద్యార్థికి చిత్రహింసలు..

Apr 9 2015 3:18 PM | Updated on Sep 3 2017 12:05 AM

జువైనల్ హోంలో హాస్టల్ డిప్యూటీ సూపరింటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు.

వరంగల్:  జువైనల్ హోంలో హాస్టల్ డిప్యూటీ సూపరింటెండెంట్ దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణ లేకుండా ఆరవ తరగతి చదువుతున్న అనిల్ అనే విద్యార్థిని హాస్టల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సాల్వాకం చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. లీగల్ మెట్రాలజీ అధికారిని ఎదుట హాస్టల్ ఆహారం విషయంపై ఫిర్యాదు చేయడమే విద్యార్థిని తీవ్రంగా హింసించడానికి కారణమని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement