రూ.లక్ష తిరిగిచ్చారు | Sri Sai Women's Association members return by One Lakh to Bank | Sakshi
Sakshi News home page

రూ.లక్ష తిరిగిచ్చారు

Oct 13 2015 3:54 AM | Updated on Sep 3 2017 10:51 AM

రూ.లక్ష తిరిగిచ్చారు

రూ.లక్ష తిరిగిచ్చారు

బ్యాంకులో డ్రా చేసిన డబ్బులకంటే ఎక్కువగా వచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు మహిళలు.

సిరిసిల్ల : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులకంటే ఎక్కువగా వచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు మహిళలు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సాయి స్లమ్ సమాఖ్యలోని శ్రీసాయి మహిళా సంఘం సభ్యులు సోమవారం సిరిసిల్ల ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నారు. క్యాషియర్ లెక్క చూసుకోకుండా వీరికి రూ.5 లక్షలు చెల్లించారు. ఇంటికి చేరిన మహిళలు డ బ్బులు లెక్కించగా, ఒక లక్ష ఎక్కువగా ఉండడంతో నిజాయతీగా బ్యాంకుకు తిరిగి చెల్లించి శభాష్ అనిపించుకున్నారు. డబ్బులు తిరిగి ఇచ్చిన మహిళా సంఘం రిసోర్సు పర్సన్ గాజుల వీణ, బూర్ల రేవతిని బ్యాంకు అధికారులు శభాష్ అని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement