‘స్పెల్-బి’ పరీక్షకు అనూహ్య స్పందన | 'Spell-B' exam response to the unpredictable | Sakshi
Sakshi News home page

‘స్పెల్-బి’ పరీక్షకు అనూహ్య స్పందన

Nov 10 2014 1:53 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఆంగ్ల భాషపై విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో స్పెల్-బి జిల్లాస్థాయి సెకండ్ రౌండ్ పరీక్ష జరిగింది.

ఖమ్మం: ఆంగ్ల భాషపై విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో స్పెల్-బి జిల్లాస్థాయి సెకండ్ రౌండ్ పరీక్ష జరిగింది. నాలుగు విభాగాలుగా జరిగిన ఈ పరీక్షకు 112మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆటమిక్ ఎనర్జీ స్కూల్ (అశ్వాపు రం), ఎక్స్‌లెంట్ హైస్కూల్ (మణుగూరు), హార్వెస్ట్ టెండర్ రూట్స్ స్కూల్, హార్వెస్ట్ స్కూల్, భరత్ టెక్నో స్కూల్, ఉషోదయ పబ్లిక్ స్కూల్, బ్లోసోం కిడ్స్ స్కూల్, సెంచరీ హైస్కూల్, డీఏవీ మోడల్ స్కూల్, న్యూ వరల్డ్ హైస్కూల్, త్రివేణి టెండర్ స్కూల్(ఖమ్మం) విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో ‘సా క్షి’ బ్రాంచ్ మేనేజర్ రాఘవేందర్‌రావు, యాడ్ మేనేజర్ శ్రీనివాస్, సర్క్యులేషన్ మేనేజర్ చా రి, హెచ్‌ఆర్ నాగేశ్వరరావు, హార్వెస్ట్ పాఠశాల ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి, పీడీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
 
ఆంగ్లంపై పట్టు ఏర్పడుతుంది

ఈ స్పెల్-బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు తప్పనిసరవుతోంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు చిన్న తనం నుంచే ఇంగ్లిష్ పట్టు ఏర్పడుతుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరు వంటి మహానగరాలకే పరిమితమైన ఈ పరీక్షను ఖమ్మం వంటి మారుమూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సాక్షి మీడియాకు కృతజ్ఞతలు. ఈ పరీక్ష ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.
 - పార్వతీరెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్
 
బాగా రాశాను

పరీక్ష బాగా రాశాను. అన్నీ తెలిసిన పదాలే వచ్చాయి. కొత్త పదాలు కూడా అర్థం చేసుకున్నాను. హెడ్‌సెట్ పెట్టుకొని టీవీలో చూస్తూ పరీక్ష రాయడం సంతోషంగా అనిపించింది. ఈ రౌండ్‌లో గెలిచి మరో రౌండ్‌కు వెళ్తాననే నమ్మకంతో ఉన్నాను. కొత్త కొత్త పదాలు నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడింది.
 - శరత్, 4వ తరగతి
 
సంతోషంగా ఉంది
నేను పరీక్ష రాసేందుకు మణుగూరు నుంచి వచ్చాను. పరీక్ష భాగా రాసినందుకు సంతోషంగా ఉంది. కొత్త కొత్త పదాలు నేర్చుకున్నాను. పోటీ పరీక్షలు రాయాలని మమ్మీ చెప్పేది. ఎక్కడ పోటీ పరీక్షలు జరిగినా హాజరవుతాను. ఈ స్పెల్-బీ పరీక్షతో మంచి అనుభవం వచ్చింది.
 - అన్విత, 4వ తరగతి
 
 
కొత్తవి నేర్చుకున్నాను
స్పెల్-బీతో కొత్త పదాలు నేర్చుకున్నాను. ఈ పరీక్ష కోసం నెల రోజులపాటు టీచర్లు కొత్త పదాలు నేర్పించారు.  వీటితో పాటు మరికొన్ని కొత్త పదాలు కూడా నేర్చుకున్నాం. మా ఫ్రెండ్స్‌కు కూడా చెప్పి స్పెల్-బి పరీక్ష రాయిస్తాను.         - ఎం.క్రిష్ణ తేజస్వి
 
పైనల్‌కు చేరుకుంటాను
గత సంవత్సరం స్పెల్-బి పరీక్షకు హాజరయ్యాను. హైదరాబా ద్ వరకు వెళ్ళి వచ్చాను. ఈ సంవత్సరం కూడా మెరిట్ లిస్టులో ఉండాలనుకుని పరీక్ష రాశాను. నాకు మా రుక్మిణి మేడం కొత్త పదాలు నేర్పించారు. ఈసారి తప్పకుండా ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటాను.
- ఫరహత్, బ్లోసోం కిడ్స్ స్కూల్ (ఖమ్మం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement