సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి

సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక దృష్టి - Sakshi


అధికారులకు లక్ష్మారెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: సీజనల్‌ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని అధికారు లను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఏజెన్సీ సహా మైదాన, లోతట్టు, బస్తీ ప్రాంతాలనూ పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం సచివాలయంలో సీజనల్‌ వ్యాధులు, ఉద్యోగ నియామకాలు, కేసీఆర్‌ కిట్ల పథకం అమలుపై ఉన్నతాధికారులతో లక్ష్మారెడ్డి సమీక్షించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుధ్యం, దోమలు, వ్యాధుల నివారణపై పంచాయతీరాజ్, పట్టణ, నగర పాలక సంస్థలతో కలసి పనిచేయాలన్నారు. వ్యాధు లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాథమిక స్థాయిలోనే పరీక్షలు చేయించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రాంతాలను తీవ్ర, మాధ్యమిక, సామాన్య విగా గుర్తించి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశిం చారు. ఇప్పటి వరకు 6,279 కేసీఆర్‌ కిట్ల పంపిణీ జరిగిం దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మున్ముందు మరిన్ని ప్రసవా లు పెరిగే అవకాశం ఉంటుందని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top