ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి | South Indian Film Awards ceremony | Sakshi
Sakshi News home page

ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి

Aug 4 2014 4:49 AM | Updated on Sep 2 2017 11:19 AM

ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి

ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి

గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు.

  • 30న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక
  • సాక్షి, సిటీబ్యూరో: గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న ఈ వేడుక కర్టన్‌రైజ్ కార్యక్రామం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో సినీ తారలు ప్రణీత, హంసా నందిని పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సురేష్..‘దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఏ భాషలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ అవార్డులు నిర్వహించిన పత్రిక లేదు. ఆ ఘనత మా పత్రికకే చెందుతుంది. ఇన్నేళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పెద్దల ఆదరాభిమానాలతో అవార్డులు అందజేస్తూ వచ్చాను. ఈ ఏడాది జేఆర్‌సీ కన్వెషన్‌లో జరపనున్న వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారు’ అని చెప్పారు.

    గత ఏడాది ఓ కన్నడ చిత్రానికిగాను ‘సంతోషం’ అవార్డు అందుకున్నానని, తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది నామినీగా నిలవడం ఆనందంగా ఉందనీ ప్రణీత తెలిపారు. నాలుగు భాషల వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అనీ, నేను నటించిన రెండు చిత్రాలు పోటీలో ఉన్నాయని హంసా నందిని అన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement