కాలుష్యానికీ యాప్స్‌ ఉన్నాయ్‌!

Some Apps Have Been Made Available To Measure Pollution - Sakshi

ఢిల్లీ వాయు కాలుష్యం గురించి తెలుసుకొని దేశంలో మిగిలిన నగరవాసుల గుండెల్లో దడ పుడుతోంది. ఇవాళ ఢిల్లీ, రేపు మరో నగరం అలా మారదన్న గ్యారంటీ ఏమీ లేదు. ప్రస్తుతం మీ ప్రాంతంలో గాలి ఎంత స్వచ్ఛం? కాలుష్యం స్థాయి ఎంత ఉంది? ఇలాంటి అంశాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. కాలుష్యాన్ని కొలవడానికి కొన్ని యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అవి మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. మీ చుట్టూ గాలి ఎంత స్వచ్ఛంగా ఉంది ? ఎంత విషం దాక్కొని ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఎయిర్‌ క్వాలిటీ, ఎయిర్‌ విజువల్‌ యాప్‌
ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే వాస్తవాలన్నీ మీ అరచేతిలో ఇమిడిపోతాయి. గత వారం రోజుల్లో మీ ప్రాంతంలో ఎంత వాయు కాలుష్యం ఉంది ? వాతావరణంలో వేడి, తేమ శాతం మొదలైన విషయాలన్నీ తెలుస్తాయి. అంతేకాదు ఆ యాప్‌ ఆన్‌లో ఉంచితే ఆ క్షణంలో అక్కడ ఉన్న గాలి పీలిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో కూడా చెప్పేస్తుంది.

ఎయిర్‌ క్వాలిటీ ప్లూమ్‌ ల్యాబ్స్‌
ఈ యాప్‌ ద్వారా మీరు నివసించే నగరంలో గాలి కాలుష్యం స్థాయి తెలుసుకోవడంతో పాటు దాని తీవ్రత పెరిగినప్పుడల్లా ఫన్నీగా ఉండే యానిమేషన్లు కూడా వస్తుంటాయి. 24 గంటల పాటు గాలిలో నాణ్యత ఎలా పెరిగిందో, ఎలా తగ్గిందో కూడా ఈ యాప్‌ చెప్పేస్తుంది.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ బ్రీజోమీటర్‌
ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ బ్రీజోమీటర్‌ యాప్‌ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఎంత కాలుష్యం ఉందో చెబుతుంది. ఆ యాప్‌లో ఆప్షన్స్‌లోకి వెళ్లి మనం కోరుకున్న నగరాన్ని ఎంపిక చేస్తే గాల్లో ఎంత కాలుష్యం ఉందో వెల్లడిస్తుంది. ప్రతి రోజూ వాతావరణ వివరాలను, అగ్నిప్రమాద ముప్పుల్ని కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎయిర్‌ క్వాలిటీ రియల్‌టైమ్‌ ఏక్యూఐ
ఎయిర్‌ క్వాలిటీ రియల్‌ టైమ్‌ యాప్‌తో గాలి కాలుష్యాన్ని మొత్తంగా అంచనా వేయొచ్చు. గాలిలో సూక్ష్మ ధూళికణాలు పీఎం 2.5, సూక్ష్మ కణాలు పీఎం 10 వంటివి ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. అవసరమైతే దానిని మన హోం స్క్రీన్‌ గార్డ్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ యాప్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కేవలం మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో గాలి నాణ్యత సూచి తెలుసుకోవచ్చు. చైనా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్, వియత్నాం వంటి 60 నగరాల్లో కాలుష్యం స్థాయి ఈ యాప్‌ మనకి అందిస్తుంది. మరెందుకు ఆలస్యం మీకు కావల్సిన యాప్‌ ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top