ఆర్టీసీలో సోలార్‌ కాంతులు 

Solar lights in the RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, ప్రధాన స్టేషన్లలో సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఆర్‌ఈడీసీఓ) అధికారులతో చర్చించిన తర్వాత ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో టీఎస్‌ఆర్‌ఈడీసీఓ డైరెక్టర్‌ సుధాకర్‌రావు, అధికారులు ఒప్పంద పత్రాలపై పరస్పరం సంతకాలు చేశారు. ఒప్పందం 25 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని  సోమారపు తెలిపారు. సోలార్‌ వినియోగంతో ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top