ఆకాశవీధిలో ఆరగిద్దాం

Sky Diving Restaurant in madhapur Hyderabad - Sakshi

గాలిలో తేలుతూ ఆకాశ అందాలను తిలకిస్తూ విందు ఆరగిస్తే ఎంత బాగుంటుందో కదా! భూమికి 160 అడుగుల ఎత్తులో రుచుల ఘుమఘుమలు ఆస్వాదిస్తే భలేగా ఉంటుంది కదా! ఈ వినూత్న అనుభవం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన స్కై డైనింగ్‌ రెస్టారెంట్‌ ద్వారా నగరవాసులకు అందుబాటులోకి రానుంది.

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే రెండో స్కై డైనింగ్‌ రెస్టారెంట్‌ నగరంలో కొలువుదీరింది. గాల్లో తేలుతూ చవులూరించే రుచులను ఆస్వాదించే వినూత్న అనుభవం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెస్టారెంట్‌ రూపకర్తలు, క్లౌడ్‌ డైనింగ్‌ రెస్టారెంట్స్‌ డైరెక్టర్లు దేవిదత్‌ కొలి, తరుణ్‌ కొలి ఈ స్కై డైనింగ్‌ వివరాలు తెలిపారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా రెస్టారెంట్‌ నెలకొల్పామని, క్రేన్ల సహాయంతో అతిథులను 160 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి విందు ఆస్వాదించే ఏర్పాటు దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ రెస్టారెంట్‌ను శనివారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. నోయిడాలో తొలి రెస్టారెంట్‌ నెలకొల్పా మన్నారు. ఇందులోకి 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదు. ఈ రెస్టారెంట్‌లోకి వెళ్లాలంటే ఒక్కొక్కరికీ రూ.4,999.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top