నయీమ్ గ్యాంగ్‌పై 99 కేసులు | sit officials filed 99 cases against nayeem | Sakshi
Sakshi News home page

నయీమ్ గ్యాంగ్‌పై 99 కేసులు

Sep 15 2016 2:07 AM | Updated on Nov 6 2018 4:42 PM

నయీమ్ ముఠాకు చెందిన సభ్యులపై ఇప్పటివరకు 99 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 83 మంది అరెస్ట్: సిట్
సాక్షి, హైదరాబాద్: నయీమ్ ముఠాకు చెందిన సభ్యులపై ఇప్పటివరకు 99 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా అరెస్ట్ చేసిన ఐదుగురితో ఈ కేసుల్లో 83 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఒక ప్రకట నలో తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన వావిల్ల సంజీవ్‌కుమార్(34), గుండూరు శ్రీను(43), కొప్పు సందీప్ (21), రేవల్లి చాకలి కృష్ణ(26), కేశమోళ్ల రమేశ్(30) లు నయీమ్‌తో కలసి కిడ్నాప్, హత్య, బలవంతపు వసూళ్లు చేసినట్లు రుజువు కావడంతో వారిని అరెస్ట్ చేశారు.

వీరిని కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నయీమ్ కేసులో ఇప్పటి వరకూ 83 మందిని అరెస్ట్ చేశారు. సిట్ కంట్రోల్ రూంకు 372 ఫోన్ ఫిర్యాదులు అందాయి. వీరిలో ఎక్కువగా భువనగిరికి చెందిన బాధితులే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement