చెట్లు నరికినందుకు 45 వేలు ఫైన్‌ | Shopping Mall In Siddipet Fined Rs 45,000 For Cutting Trees | Sakshi
Sakshi News home page

చెట్లు నరికినందుకు 45 వేలు ఫైన్‌

Dec 21 2019 2:25 AM | Updated on Dec 21 2019 7:56 AM

Shopping Mall In Siddipet Fined Rs 45,000 For Cutting Trees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేటజోన్‌: సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రకటనల కాంట్రాక్టరుకు రూ.45 వేల జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement