'శ్రీకాంత చారిలాగానే ఆత్మాహుతి చేసుకుంటా'

Shankaramma demands Suryapet MLA ticket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిఅమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ తెలంగాణ భవన్‌లో బుధవారం కంటతడిపెట్టారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌ రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు. నియోజక వర్గంలో పని చేయని సైదిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారన్నారు. తనకు కేటీఆర్, కేసీఆర్‌ల సపోర్ట్ ఉన్నా కూడా జగదీశ్‌ రెడ్డి టికెట్‌ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

తనకు టికెట్ ఇవ్వకపోతే జగదీష్ రెడ్డి ఇంటి ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని శంకరమ్మ హెచ్చరించారు. తనకు సూర్యాపేట టికెట్‌ ఇచ్చి, అంత బలం ఉన్న జగదీశ్‌ రెడ్డి హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని, ప్రజల మద్దతుతోనే గెలుస్తానన్నారు. తాను వేల మెంబర్ షిప్‌లు చేయించినా, జగదీశ్‌ రెడ్డి బలపరుస్తున్న సైదిరెడ్డికి టికెట్ ఇస్తున్నారన్నారు. టికెట్‌ రాకపోతే జగదీశ్‌ రెడ్డి ఇంటి‌ముందు శ్రీకాంత చారి లాగానే ఆత్మాహుతి చేసుకుంటానన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top