భూముల కోసం వేట

భూముల కోసం వేట - Sakshi


- ఫిలింసిటీ కోసం స్థలాల అన్వేషణ

- జిల్లా యంత్రాంగానికి సినిమా కష్టాలు

- భూ లభ్యతపై సందేహాలు

- జవహర్‌నగర్‌పై యంత్రాంగం మొగ్గు

- దీంతోనైనా అక్రమాలకు కళ్లెం వేయవచ్చని అంచనా

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఫిలింసిటీ’ ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు వేయి ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తామని  ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే అనువైన భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భూ లభ్యతపై దృష్టి సారించిన రెవెన్యూ యంత్రాం గం.. ఒకేచోట ఆ స్థాయిలో భూసమీకరణ అంత సులువుకాదని భావిస్తోంది.నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని యోచించినప్పటికీ, అట వీ ప్రాంతం కావడం.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు కేంద్ర  పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ప్రకటించిన నేపథ్యం లో.. రాచకొండ విషయంలో సాధ్యాసాధ్యాలపై అంచనా వేస్తోంది. అటవీ ప్రాంతంలో బిట్లు బిట్లుగానేవేయి ఎకరాలు లభిస్తుంది తప్ప నిర్దేశిత స్థాయి లో భూమి అందుబాటులోలేదని రెవెన్యూ యం త్రాంగం అంటోంది. అంతేగాకుండా రిజర్వ్ ఫారెస్ట్ కు నిర్దేశించిన ప్రాంతంలో  కట్టడాలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నందున.. ఈ ప్రాంతంలో ఫిలింసిటీ నిర్మించాలనే ఆలోచన సరికాదని చెబుతోంది.దీంతో పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిం చిన జిల్లా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు చేరువలో ఫిలింసిటీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. శంషాబాద్ పరిసరాల్లో ఫిలింసిటీని ఏర్పాటు అంశాన్ని పరిశీలించినప్పటికీ, ఈ ప్రాంతం 111జీవో పరిధిలో ఉండడంతో యోచనను విరమించుకుంది. షాబాద్ మండలం సీతారాంపూర్‌లోని దేవాదాయశాఖ భూముల్లో కూడా ఫిలింసిటీని ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే అంశం పై కూడా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి చేరువలో ఈ చోటు ఉండడం సానుకూలంగా మారుతుందని భావిస్తోంది.

 

జవహర్‌నగర్ వైపు మొగ్గు!

ఫిలింసిటీ ఏర్పాటుకు పలు భూములను పరిశీలి స్తున్న యంత్రాంగం జవహర్‌నగర్ భూములపై దృష్టిసారించింది. నగరానికి సమీపంలో ఉండడం తో ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తోంది. సుమారు 3వేల ఎకరాల భూమి ఒకే చోట లభించే అవకాశం ఉండడం.. సమీప ప్రాంతంలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో జవహర్‌నగర్ భూముల ను ఫిలింసిటీకి కేటాయించేందుకు యంత్రాంగం మొగ్గు చూపుతోంది. దాదాపు 5వేల ఎకరాల విస్తీ ర్ణం కలిగిన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల పైచిలు కు ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. ఈ కట్టడాలను తొలగించడం.. అక్రమార్కులు మళ్లీ నిర్మించుకోవడం షరా మామూలుగా మారిన తరుణంలో.. ఈ భూములను ఫిలింసిటీకి కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top