వరంగల్ జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత | school students Illnesses in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

Jun 25 2016 2:08 PM | Updated on Sep 4 2017 3:23 AM

వరంగల్ జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

వరంగల్ జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శనివారం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వరంగల్: స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శనివారం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. గణపురం మండలం చేల్పుర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రార్థన చేసున్న విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల వెనుక భాగంలో ఉన్న పెద్ద బావిలో నుంచి దుర్వాసన రావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement