సత్యం రామలింగరాజు.. లైబ్రేరియన్ | satyam ramalingaraju will work as librarian | Sakshi
Sakshi News home page

సత్యం రామలింగరాజు.. లైబ్రేరియన్

May 8 2015 12:44 AM | Updated on Sep 3 2017 1:36 AM

సత్యం రామలింగరాజు.. లైబ్రేరియన్

సత్యం రామలింగరాజు.. లైబ్రేరియన్

చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలను అప్పగించినట్లు జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం తెలిపారు.

హైదరాబాద్: చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలను అప్పగించినట్లు జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం తెలిపారు. అతని తమ్ముడు రామరాజుకు వయోజనవిద్య బాధ్యత అప్పగించామన్నారు. జైలులో దాదాపుగా వెయ్యికి పైగా ఉన్న ఖైదీలలో 300 మంది వరకు చురుకుగా పనిచేస్తారని, మిగతా వారందరికీ వారివారి వృత్తిరీత్యా పనులు కేటాయించామన్నారు.  నిత్యం పుస్తక పఠనంలో గడుపుతున్న రామలింగరాజుకు లైబ్రరీ సరైందని భావించిన కమిటీ సభ్యులు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement