స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు బ్రేక్‌! 

Satavahana University E Pass Problems - Sakshi

శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు 2018–19 విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కానీ.. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్‌ కేంద్రాలను ఆశ్రయిస్తే సంబంధిత కళాశాలలు, కోర్సుల వివరాలు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణమేం టని కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్‌ అధికా రుల చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 30తో కొత్త దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు కలవరపడుతున్నారు.

జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరున ముగియనుంది. కానీ.. నేటికీ కొత్తగా కోర్సుల్లో చేరిన డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ఈ–పాస్‌లో కళాశాలల వివరాలు లేకపోవడంతో  సాధ్యపడడం లేదు. ఏటా యూనివర్సి టీ అధికారులు అనుబంధ హోదా పక్రియ ముగి సిన తర్వాత హోదా దక్కిన కళాశాలల వివరాల ను ఈ–పాస్‌కు అనుసంధానం చేయాల్సి ఉం టుంది. అయితే నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్‌ అధికారులు ఈ విషయంలో జా ప్యం వీడి వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోనేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని విద్యార్థులు, వి ద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
ఆలస్యమవుతున్న పక్రియ
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్న వారు ఉపకారవేతనాల దరఖాస్తుకు సిద్ధమయ్యారు. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 70 రోజులు గడిచినా ఇంతవరకు దరఖాస్తు చేసుకోనే వీలులేకపోవడంతో ప్రతిరోజూ ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్ల డం.. నిరాశతో తిరిగి రావడం విద్యార్థుల వంతవుతోంది. కొందరు విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తే.. యూనివర్సిటీ, ఈ పాస్‌ అధికారుల చేతులో ఉంటుందని సర్దిచెబుతూ వస్తున్నారు. కానీ అసలు విషయం మరో లా ఉంది. శాతవాహన యూనివర్సిటీ అధికారులకే ఈపాస్‌కు సంబంధించిన లాగిన్‌ సమాచారం లేకపోవడంతోనే కళాశాలల వివరాలు అనుసంధానం కాలేదని సమాచారం. కేవలం శాతవాహనకే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం. ఈ పాస్‌ అధికారులు యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన లాగిన్‌ సమాచారమిస్తేనే కళాశాలల వివరాలు ఈ–పాస్‌లో నమోదయ్యే అవకాశముంటుంది. తర్వాత యథావిధిగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.
 
అనుసంధానం పూర్తయ్యేదెన్నడో...!
ఉపకార వేతనాల దరఖాస్తులు ప్రారంభం రోజులు గడుస్తున్నా నేటికీ అవకాశం లేకపోవడంతో డిగ్రీ మొదటి సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్‌ అధికారులు యూనివర్సిటీ అధికారులకు అనుసంధానికి కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ హోదా ప్రకటించిన తర్వాత ఆయా కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ అధికారులు అనుసంధానం చేస్తేనే విద్యార్థులకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంటుంది. గడువు ఈనెల 30 వరకు ఉందిగానీ శాతవాహన అధికారులకే లాగిన్‌ సమాచారం లేకపోవడంతో అనుసంధానం ఆలస్యమవడం ఖాయమని తెలుస్తోంది.

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ–పాస్‌ అధికారులు, యూనివర్సిటీలకు లాగిన్‌ సమాచారమందిస్తాయని, అనంతరం అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడక తప్పదని అధికారవర్గాల ద్వారా సమాచారం. ఈ–పాస్‌ అధికారులు సత్వరమే స్పందించి దరఖాస్తుల ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
 
లాగిన్‌ సమాచారం రాలేదు...
ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నవారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ పాస్‌ అధికారుల నుంచి శాతవాహనకు లాగిన్‌ సమాచారం రాలేదు. కళాశాలల సమాచారం అనుసం«ధానం చేయలేదు. శాతవాహనతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉంది. కాకతీయ, శాతవాహన పరిధిలోని పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయిన తర్వాత లాగిన్‌ సమాచారం వచ్చి అనుసంధానం చేసే అవకాశాలుంటాయి. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top