తల్లిని ఊర్లోకి రానివ్వని సర్పంచ్‌ | Sarpanch Refused to Mother Entry in Village Sangareddy | Sakshi
Sakshi News home page

తల్లిని ఊర్లోకి రానివ్వని సర్పంచ్‌ సాయగౌడ్‌

Apr 14 2020 10:30 AM | Updated on Apr 14 2020 10:30 AM

Sarpanch Refused to Mother Entry in Village Sangareddy - Sakshi

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గోసాయిపల్లిలో లాక్‌డౌన్‌ పకడ్బందిగా అమలు చేస్తున్నారు. గోసాయిపల్లి సర్పంచ్‌ సాయగౌడ్‌ తన తల్లి తులశమ్మ సోమవారం గ్రామానికి వచ్చింది. ఊర్లోకి రానివ్వకుండా పొలిమేరల్లో అడ్డుకుని వెనుకకు పంపించారు. ఇటీవలే తులశమ్మ సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు వెళ్లింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో గ్రామంలో ఎవరూ రాకుండా.. బయటకు వెళ్లకుండా ఉండేందుకు రోడ్డును మూసివేశారు. సొంత గ్రామానికి తులశమ్మ రావడంతో అందరికీ ఒకే విధంగా నిబంధనలు వర్తిసాయని సర్పంచ్‌ స్పష్టం చేశారు. ఊరుబయట నుంచే అమెను తిరిగి సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement