విక్రయిస్తే ఆందోళన చేస్తామంటూ మహిళల హెచ్చరిక
నారాయణఖేడ్ : సారా విక్రయం లేదా తాగడం చేస్తే ఆందోళనలతో పాటు దాడులు చేస్తామని మండలంలోని అంత్వార్ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. గ్రామస్తులు పాటు ఖేడ్ ఎస్‌ఐ బాల్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం గ్రామం లో సారా విక్రయాలు జరపరాదని, సారాను తాగరాదని తీర్మానం చేశారు. సారాను విక్రయిస్తే రూ. 5 వేలు, సారా సేవిస్తే రూ.2 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.
అనంతరం తీర్మాన పత్రంలో గ్రామస్తుల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నలుగురు వ్యక్తులు సారాను విక్రయిస్తున్నారన్నారు. దీనికి కారణంగా ఎస్సీ కాలనీ ప్రజలు సారాకు బానిసై రోజూ భార్య బిడ్డలతో గొడ వలు పడుతున్నారని తెలిపారు.
గ్రామంలో నాటుసారా విక్రయిస్తున ్నట్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలో సారాను పారబోసి నిరసన తెలిపారు. మళ్లీ సారా విక్రయాలు ప్రారంభిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు రాణమ్మ, దుర్గమ్మ, అనిత, జయశీల, కాంతమ్మ, స్వరూపరాణి, శక్కమ్మ, అనితమ్మ, రూథమ్మ, పీరమ్మ, శామమ్మ, పద్మమ్మ, గ్రామ ఎంపీటీసీ డేవిడ్, సర్పంచ్ నిజలింగప్ప, ఉప సర్పంచ్ లింగమ్మ, ఖేడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసన్నకుమార్, గ్రామ పెద్దలు శంకర్‌రావు పాటిల్, శివరావ్, సాల్మన్, రాములు, వినోద్‌కుమార్, తదితరులు ఉన్నారు.
సారాతో కాలనీలో శాంతి లేదు
సారాతో మా కాలనీల్లో ప్రశాంతత లేదు. రోజూ ఎవరో ఒకరు సారా తాగి గొడవలకు పాల్పడుతున్నారు. సారా విక్రయాలు నిలిపివేయాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మహిళలంతా ఏకమై సారాను దూరం చేయాలని తీర్మానం చేశాం.
- రాణమ్మ, అంత్వార్ గ్రామ మహిళ
కుటుంబాల్లో సారా చిచ్చుపెడుతోంది
సారా తాగడంతో కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయి. సారా తాగిన వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. సారా విక్రయాలు లేకపోతే మా గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండవనే ఉద్దేశంతో తీర్మానం చేసేందుకు ముందుకు వచ్చాం. మాకు అధికారులు సహకారం కావాలి.
- దుర్గమ్మ, మహిళ, అంత్వార్
అంత్వార్‌లో సారాను నిషేధిస్తూ తీర్మానం
Published Sat, Aug 2 2014 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement