సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు పురస్కారం

Sakshi Cartoonist Shankar Won Life Time Achievement Award

 లక్డీకాపూల్‌: ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్టు శంకర్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌లో శనివారం జరిగిన కార్టూన్‌ ఫెస్టివల్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కార్టూన్‌ వాచ్‌ ఆధ్వర్యంలో 2019, 2020 సంవత్సరాలకు గానూ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్‌.బైజేంద్ర కుమార్‌ అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సాక్షి కార్టూనిస్టు శంకర్, నవ తెలంగాణ కార్టూనిస్టు నర్శిం, నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.

2019 సంవత్సరానికి గానూ దివంగత సీనియర్‌ కార్టూనిస్టు మోహన్, సీనియర్‌ కార్టూనిస్టులు జయదేవ్‌ బాబు, ఎం.ఎస్‌.రామకృష్ణ జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. దివంగత సీనియర్‌ కార్టూనిస్టు మోహన్‌ తరఫున జర్నలిస్టు ప్రకాష్‌ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో కార్టూన్‌ వాచ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, పాత్రికేయులు కట్టా శేఖర్‌రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top