గుత్తా బాధ్యతల స్వీకారానికి సీఎం! | Sakshi
Sakshi News home page

గుత్తా బాధ్యతల స్వీకారానికి సీఎం!

Published Sat, Mar 3 2018 4:14 AM

Rythu Samanvaya Samithi chairman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గుత్తా పేరును ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌ను ఢిల్లీలో రిజిస్ట్రేషన్‌ చేయించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. నేడో రేపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియనుంది. అనంతరం జీవో జారీ చేసి అధికారికం గా గుత్తా పేరును ప్రభుత్వం ప్రకటించనుంది. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. గుత్తా చాంబర్‌ను బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సిద్ధం చేశారు. అక్కడే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఖేందర్‌రెడ్డి సోదరుడు, కుమారుడు వ్యవసాయ కమిషనరేట్‌కు వచ్చి కార్యాలయాన్ని, ఇతర వసతులను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement