రైతు కళ్లలో ఆనందం చూడాలి

Rythu Nandu Scheme Is Good Minister Laxma Reddy - Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : దాదాపు అరవై ఏళ్లుగా అరిగోస పడిన తెలంగాణ రైతాంగం కళ్లలో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్‌ రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీహాల్‌లో రైతుబంధు పథకంలో భాగంగా పట్టా పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంత రం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు.

ప్రతి అన్నదాత కళ్లలో ఆనందం చూడాలనే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతే రాజులా బ తికే విధంగా చేయాలన్నాదే సీఎం కేసీఆ ర్‌ లక్ష్యమన్నారు. పాస్‌ పుస్తకాల కోసం ఒక్కప్పుడు రైతుల, రెవెన్యూ కార్యాలయాల చుట్టు కాళ్ల అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో అధికారులే గ్రామాలకు వెళ్లి పాస్‌ బుక్కులు పంపిణీ చేస్తారన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసి రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. ప్రస్తుతం భూ రికార్డులో కాస్తు కాలం తొలగించి సులభతరం చేశామన్నారు.

పెట్టుబడి కింద రైతులకు పంపిణీ చేసేందుకు రూ.6 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో రూ.4 వేల కోట్లు ఇప్పటికే ఆర్‌బీఐలో డిపాజిట్‌ చేశామన్నారు. తెలంగాణ రైతులకు సాగు, ఎరువులు, విద్యుత్, పెట్టుబడి ఇలా అనేక రకాలుగా రైతుల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టా యని కేంద్రం నివేదికలు వెల్లడించా యన్నారు. ప్రతి అభివృద్ధి పథకానికి అడ్డుపడే అలవాటు ఉన్న ప్రతిపక్షాలు రైతు పెట్టుబడి పథకాన్ని కూడా అడ్డుకుంటాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటన.. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలన్నారు. త్వరలోనే పంపిణి షెడ్యుల్‌ను ప్రకటించనున్నట్లు వివరించారు. చెక్కులతోపాటు వెంటనే డబ్బులను డ్రా చేసుకునే విషయాన్ని రైతులకు చెక్కుల పంపిణీ సమయంలోనే వెల్లడించాలని సూచించారు. 

ప్రజాప్రతినిధులకు సమాచారం.. 

రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తున్న సీఎం దేశంలో ఎక్కడ లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఆర్‌ రెడ్డి, రాంమోహన్‌రెడ్డిలు అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జా గ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంపిణీ తేదీలను ఎమ్మెల్యేలతోపాటు, స్తానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల వారీగా పంపిణీ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వివరించారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.

రైతు పెట్టుబడి ఆర్‌ఎస్‌ఎస్‌లకే.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు పెట్టుబడి పథకంలో వచ్చే పెట్టుబడి నగదును వదులుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్పస్‌ ఫండ్‌కు జమ చేస్తామని  మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఎస్‌ఆర్‌రెడ్డిలు సూచించారు. ఆర్థికంగా ఉన్న ప్రజాప్రతినిధు లు తమకు వచ్చే పెట్టుబడిని స్వచ్ఛందంగా వదులుకోవాలని వారు పిలుపునిచ్చారు.

వదులుకుంటే కార్పస్‌ ఫండ్‌కు..

ఎండల తీవ్రత వల్ల చెక్కల పంపిణి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నట్లు తెలిపారు. స్థానికంగా రైతు సమన్వయ సమితిలు, ప్రజాప్రతినిధుల కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్లను సమాయత్తం చేసినట్లు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా ముద్రించిన పాసుపుస్తకాలు, చెక్కులను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ బస్వరాజ్‌గౌడ్, జేసీ వెంకట్రావ్, సబ్‌కలెక్టర్‌ కృష్ణాదిత్య, వ్యవసాయాధికారి సుచరిత, రైతుబంధు పథకం ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top