ఎస్‌ఐ అభ్యర్థులూ.. ఇవి పాటించండి! 

Rules And Regulations Of SI Exam - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ కేడెట్‌ ట్రెయినీ ఎస్‌ఐ(సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఫైర్‌) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కోసం ఉమ్మడి జిల్లాలో కేవలం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మాత్రమే 32పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,292మంది పరీక్షకు హాజరుకానుండగా.. పరీక్ష ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాతపరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం పోలీసు శాఖ పలు సూచనలు జారీ చేసింది.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు  

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రం వద్దకు నిర్ణీత సమయం కంటే ముందుగా చేరుకోవాలి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించరు. 
  • పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. టీఎస్‌ఎల్‌ఆర్బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లు జారీ చేశారు. డూప్లికేట్‌ జారీ ఉండదు. 
  • తుది రీక్ష అనంతరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్, దేహదారుఢ్య పరీక్షలు, అభ్యర్థి తన దరఖాస్తులో పేర్కొన్న పూర్తి వివరాలను పరిశీలించాకే అర్హతల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక జరుగుతుంది. 
  • పరీక్ష హాల్‌లో బ్లాక్‌ లేదా బ్లూపాయింట్‌ పెన్ను, తుది పరీక్ష హాల్‌ టికెట్, ఏదైనా ఒక ఒరిజినల్‌ ధ్రువపత్రం(పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌) మాత్రమే వెంట ఉంచుకోవాలి. 
  • హాల్‌ టికెట్లలో అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టం గా ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. హాల్‌టికెట్‌ను లేజర్‌ ప్రింటర్‌ ద్వారా తీసుకోవాలి. 
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో పూరించిన విధంగా తన హాల్‌టికెట్‌లో ఇన్విజిలేటర్‌ సమక్షాన సంతకం చేయాలి. 
  • పరీక్ష రాసే ముందు అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌పై సూచనలను పూర్తిగా చదవాలి. ఓఎంఆర్‌ షీట్‌పై పేర్కొన్న బుక్‌లెట్‌ కోడ్‌ వచ్చిందో చూసుకోవాలి. 
  • తుది పరీక్ష 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు. 
  • అభ్యర్థి ప్రశ్నాపత్రం తెరిచిన వెంటనే పేపర్‌ బుక్‌లెట్, 200 ఆబ్జెక్టివ్‌ మాదిరి ప్రశ్నల ముద్రణ సరిగ్గా ఉందా, లేదా అని చూసుకోవాలి. లేనిపక్షంలో వేరే ప్రశ్నపత్రం తీసుకోవాలి. 
  • అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపు చిహ్నాలు రాస్తే పరిగణనలోకి తీసుకోరు. 
  • పరీక్ష హాల్‌లో అభ్యర్థి ఏ విధమైన మోసపూరిత చర్యలకు పాల్పడినా ఆ అభ్యర్థి ఓఎంఆర్‌ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోరు. 
  • అభ్యర్థి పరీక్షా హాల్‌ను వదిలి వెళ్లేటప్పుడు ఒరిజినల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. కేవలం ప్రశ్నపత్రం బుక్‌లెట్, ఓఎంఆర్‌ షీట్‌ పెన్సిల్‌ కాపీని మాత్రమే తీసుకెళ్లాలి. పరీక్ష పూర్తయ్యేంత వరకు దీనిని ఒరిజినల్‌ ఓఎంఆర్‌ నుంచి వేరు చేయొద్దు. పరీక్ష అనంతరం ఇన్విజిలేటర్‌ సమక్షంలో డూప్లికేట్‌ ఓఎంఆర్‌ షీట్‌ను వేరు చేసి తీసుకెళ్లాలి.  

మరికొన్ని... 

పరీక్ష సెంటర్‌ లోపలికి ఏవైనా ఎలక్ట్రానిక్‌ వస్తువు లు సెల్‌ఫోన్, సెల్యూలర్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌టేబుల్, పర్సులు, చార్ట్స్, విడి కాగితాలు, రికార్డు చేసే పరికరాలను అనుమతించరు. ప్రతీ అభ్యర్థి నుంచి బయోమెట్రిక్‌ వివరాలు సేకరిస్తారు. అభ్యర్థులు చేతులు, పాదాలపై మెహందీ, సిరా రాసుకుంటే పరీక్షకు అనుమతించరు. ప్రశ్నపత్రం ఆంగ్లం – తెలుగు, ఆంగ్లం – ఉర్దూ భాషల్లో ఉంటుంది. ఓఎంఆర్‌ పత్రంలో వృత్తాలను బ్లూ, బ్లాక్‌ పెన్నులతో మాత్రమే పూరించాలి. ఇతర రంగుల పెన్నులు, పెన్సిల్స్, ఇంక్,జెల్, పెన్నులతో రాయడానికి అనుమతి లేదు. అలాగే, షీట్‌పై రబ్బర్‌ లేదా వైట్‌ప్లూయిడ్‌ వాడినట్లు గుర్తిస్తే దానిని పరిగణనలోకి తీసుకోరు.  

పరీక్ష కేంద్రాలు ఇవే..  

రూట్‌ – 1 : భూత్పూర్‌ వైపు  
ప్రజ్ఞా హైస్కూల్, ఢిల్లీ ఒలింపియాడ్‌ స్కూల్, మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్, ఎంవీఎస్‌ జూనియర్‌ కళాశాల, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల, పంచవటి విద్యాలయం, ఫాతిమా విద్యాలయం, క్రీస్తుజ్యోతి విద్యాలయం  
రూట్‌ – 2 : దేవరకద్ర రోడ్‌ 
గవర్నమెంట్‌ మోడల్‌ బేసిక్‌ హైస్కూల్, గవర్నమెంట్‌ హైస్కూల్‌(గాంధీ రోడ్డు), నాగార్జున హైస్కూల్, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్, జేపీఎన్‌సీఈ, స్విట్స్‌ 
 రూట్‌ – 3 : ఏనుగొండ వైపు  
గవర్నమెంట్‌ డైట్‌ కాలేజ్, గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్, లుంబిని హైస్కూల్, గెలాక్సీ హైస్కూల్, ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజ్, ఎస్‌వీఎస్‌ డెంటల్‌ కళాశాల, ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాల.  
రూట్‌ – 4 : కొత్త బస్టాండ్‌ 
ఆదర్శ జూనియర్‌ కళాశాల, మోడ్రన్‌ హైస్కూ ల్, రెయిన్‌బో హైస్కూల్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(బాలుర), ఎన్‌టీఆర్‌ డిగ్రీ క ళాశాల, గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌(బాలికలు)  
రూట్‌ – 5 : న్యూటౌన్‌ నుంచి మెట్టుగడ్డ 
వాసవి డిగ్రీ కాలేజీ, భవిత జూనియర్‌ కాలేజ్, హ్యాపీనైజ్‌ స్కూల్, స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల, న్యూరిషి హైస్కూల్‌

పారదర్శకంగా రాత పరీక్ష 

మహబూబ్‌నగర్‌లో ఈనెల 26న నిర్వహిస్తున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష అత్యంత పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేం ద్రంలోని 32 సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుం దని తెలిపారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతీ అభ్యర్థి గంట ముందుగానే కేం ద్రాలకు చేరుకోవాలని సూచించారు. కాగా, పరీక్ష నేపథ్యంలో 26న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఆ రోజు జిరాక్స్‌ కేంద్రాలు, ఇంటర్‌నెట్‌ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు.

లౌడ్‌స్పీకర్లు, మైకులకు పట్టణంలో అనుమతి ఉండదని చెప్పారు. అలాగే, పరీక్షరాసే అభ్యర్థుల కోసం స్థానిక బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏరాకపటుచేస్తామని తెలిపారు. పరీక్షలో అవకతవకలకు పాలడ్పిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నోడల్‌ అధికారి 94910 43859 నంబర్‌లో సంప్రదించాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా పలు పరీక్షల కేంద్రాలను ఎస్పీతో పాటు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, జేఎన్‌టీయూ అధికారులు పరిశీలించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top