
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నెలవంక కనిపించలేదని, దీంతో ఆగస్టు 1న బక్రీద్ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబ్బుల్ పాషా ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇస్లామీ కేలండర్ ప్రకారం గురువారం నుంచి జిల్‌హజ్ నెల ప్రారంభమవుతోందని, ఇదే నెల పదో తేదీన ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారన్నారు.