లిక్కర్‌ కాదు..లైబ్రరీ కావాలి

RS Praveen Kumar Aroused the Thought of the Students With his Speech - Sakshi

గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

శంకరపట్నం(మానకొండూర్‌): గ్రామాల్లో లిక్క ర్‌ కాదు ..చదువుకునేందుకు లైబ్రరీ ఉండాలే... ఆకలేస్తే అక్షరాలు తినాలని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ప్రభుత్వ బడిలో చదువుకున్న ఎస్సెస్సీలో 600మార్కులకు 389 మార్కులు సాధించిన, ఇంటర్‌లో గవర్నమెంట్‌ కాలేజీలో చదువుకొని కష్టపడి ఐపీఎస్‌ సాధించినప్పుడు మీరెందుకు ఐఏఎస్‌ కాకూడదని విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పేదవిద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించా లని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థికి ఒక్క రూపాయి ఇవ్వండి మీరు ఇచ్చేది రూపాయే కని విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకున్న ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంటర్‌ తర్వాత ముఖ్యంగా బాలికలు మంచి కాలేజీ ఎంపిక చేసుకుని డిగ్రీ చదువుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top