గంజాయి సీజ్: నిందితుడితో పోలీసులు బేరసారాలు | Rs. 25 lakh worth ganja seized in medak district | Sakshi
Sakshi News home page

గంజాయి సీజ్: నిందితుడితో పోలీసులు బేరసారాలు

May 20 2014 11:12 AM | Updated on Sep 2 2017 7:37 AM

మెదక్ జిల్లాలోని గిరిజన తండాపై పోలీసులు దాడి చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

మెదక్ జిల్లాలోని గిరిజన తండాపై పోలీసులు దాడి చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయినీ సీజ్ చేసి, నిందితుడిని పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే తనపై కేసు నమోదు చేయవద్దని ఎంత సొమ్ము కావాలంటే అంత ఇచ్చుకుంటానని పోలీసులకు వివరించాడు. అంతే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా ఎంత ఇస్తావంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.

 

పోలీస్ స్టేషన్లో పోలీసులు, నిందితుడి మధ్య బేరసారాలు చూసి అక్కడ ఉన్న వారు అవాక్కయ్యారు. జిల్లాలోని మనూరు గిరిజన తండాలో భారీగా గంజాయి అక్రమంగా దాచి ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు గిరిజన తండాపై దాడి చేసి రూ. 25 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement