ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది.
అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న మూర్తిరాజు కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు పడి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, కిలో వెండి, రూ. 2 లక్షల విలువ చేసే పట్టుచీరలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన స్థానికులు మూర్తి సహా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు