రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎంపీ | Road construction should be completed | Sakshi
Sakshi News home page

రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎంపీ

May 25 2015 11:29 PM | Updated on Sep 3 2017 2:40 AM

పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.

భువనగిరి : పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఎంఆర్‌ఆర్, సీఆర్‌ఆర్, పీఎంజీఎస్‌వై, నాబార్డు రోడ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడాఉతూ ప్రభుత్వం గ్రామీణరోడ్ల అభివృద్ధికి నిధులను కేటాయించిందని వాటిని సకాలంలో ఖర్చు చేసిన నాణ్యతకు లోటు రాకుండా పూర్తి చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఈఈలు వెంకటరమణ, డీఈలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement