కబ్జా చెర వీడింది

revenue officials Recovered pond land from kabjadarulu - Sakshi

చెరువులో పంటల సాగు

సాక్షి కథనంతో కదిలిన యంత్రాంగం

శిఖం భూమిలో జేసీబీతో చదును

ధారూరు(వికారాబాద్‌) : మండలంలోని గురుదోట్లలో ఉన్న కొత్త చెరువును కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి కబ్జాచేసి వరి, జొన్న పంటలు సాగుచేసిన సంగతి తెలిసిందే. ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికతో సోమవారం వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ సంఘటనపై ఆర్‌ఐ యాదయ్య, సర్వేయర్‌ ప్రభు, వీఆర్‌ఓ శ్రీశైలం చెరువు ప్రాంతానికి వెళ్లి రైతులు సాగు చేసిన పంట పొలాలను సోమవారం పరిశీలించారు. చెరువును కబ్జాచేసి సాగునీటితో గురుదొట్ల ఎంపీటీసీ సభ్యులు నేనావత్‌ గోరీబాయితో పాటు గుండ్యానాయక్, గమ్మిబాయి, రూప్లనాయక్, కొంకలి వీరమ్మ, కొంకలి బుగ్గయ్య, దామ్లానాయక్, హన్మంతు, సూబ్య, శంకర్‌ చెరువును కబ్జా చేసి జొన్నను సాగు చేశారు. చెరువును కబ్జాచేయడం నేరమని పంట పొలాలను తొలగించాలని ఆర్‌ఐ యాద య్య ఆదేశించారు. 14.01ఎకరాల చెరువు విస్తీర్ణంలో 9 ఎకరాలను రైతులు కబ్జా చేసినట్లు సర్వేలో బయటపడింది. వెంటనే జేసీబీతో పంటలను తొలగించారు. ఇకముందు ఎవరైనా చెరువు శిఖం భూమిని కబ్జా చేసిన అక్రమంగా దున్ని పంటలను సాగు చేసినా ఆయా రైతులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ హెచ్చరించారు. చెరువుశిఖం భూమిని తమ ఆదీనంలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top