
బీసీల హక్కులు హరిస్తారా: రేవంత్‌రెడ్డి
స్థానిక సంస్థల్లో అమల వుతున్న రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో అమల వుతున్న రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మైనారిటీలను బీసీల్లో చేర్చడంవల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతుందన్నారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 50 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయితే వీటిలో 30 వార్డుల్లో బీసీ–ఇ కేటగిరీకి చెందిన ముస్లిం మైనారిటీలే గెలిచారని తెలిపారు. 50 స్థానాల్లో బీసీలు కేవలం 20 స్థానాల్లో మాత్రమే గెలిచారని వివరించారు. దీనివల్ల బీసీలకు అన్యాయం జరగడం లేదా అని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలుచేస్తామం టున్న కేసీఆర్, మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.