ఎంత డబ్బు కావాలో చెప్పండి: స్టీఫెన్తో రేవంత్

ఎంత డబ్బు కావాలో చెప్పండి: స్టీఫెన్తో రేవంత్ - Sakshi


హైదరాబాద్:  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత తనకే అప్పజేప్పారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.  ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేంద్ర రెడ్డిని కూడా తానే ఎంపిక చేసినట్టు ఆయన అన్నారు.  ఈ సందర్భంగా రేవంత్.. స్టీఫెన్ల మధ్య  సంభాషణ ఇలా సాగింది. రేవంత్.. స్టీఫెన్తో మాట్లాడుతూ.. తమ బాస్తో మాట్లాడి.. మీకు ఏం కావాలో ఫైనలైజ్ చేస్తానంటూ స్టీఫెన్ను ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది.  అలాగే మీకు ఇప్పుడు ఎంత డబ్బులు కావాలో చెబితే.. ఇప్పుడే ఇచ్చేస్తామని అన్నారు. మిగిలిన డబ్బులు ఎప్పుడు కావాలో చెప్పండి.. అప్పుడు ఇస్తామని చెప్పారు.మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ అసెంబ్లీ కూడా హైదరాబాద్లోనే ఉంది కనుక 10 ఏళ్లు ఇక్కడే ఉంటుందని చెప్పుకోచ్చారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదంటూ స్టీఫెన్ కు హామీఇచ్చారు. అందులోనూ జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువని, 17 మందిలో ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారో తెలియదంటూ వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top